అనంత: విహార యాత్రలో విషాదం.. యువకుడు మృతి

55చూసినవారు
అనంత: విహార యాత్రలో విషాదం.. యువకుడు మృతి
కూడేరు మండలం ఏపీబీఆర్ వద్ద విహారయాత్రకు వచ్చిన భరత్‌కుమార్(23) నీటిలో మునిగి మృతి చెందాడు. అనంతపురం చెందిన భరత్ ఇటీవల బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన అతను నీటిలో దిగాడు. లోతైన గుంతలో మునగడంతో మిగతా ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. స్థానికులు వచ్చి తీసి బైక్ పై ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్