కూడేరు మండల కేంద్రంలోని సంగమ్మ సంగమేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపోత్సవాన్ని వెలిగించిన ఆలయ ఈఓ రమేష్ బాబు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన కూడేరు సంగమేశ్వర దేవాలయంలో పార్వతి పరమేశ్వరులు ఒకే పానిపట్టుపై లింగ రూపంలో దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించడంతో వెలుగులు చిమ్ముకున్నాయి.