గార్లదిన్నె మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రామాంజనేయులుకు చెందిన పెంపుడు పిల్లిని వేటగాళ్లు చంపిన ఘటన గురువారం జరిగింది. ఇటీవలే మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఆ పిల్లిని ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చూసి నేలకేసి కొట్టారని ఆయన వాపోయారు. వారిని పట్టుకునేలోపే పారిపోయినట్లు గ్రామస్థులు పోలీసులకు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.