కూడేరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సోమవారం అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాన్నిఐసిడిసి సిడిపిఓ శ్రీదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని అంగన్వాడి స్కూల్లో చేర్పించాలని ఆమె పిల్లల తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా లెర్నింగ్ మెథడ్ ద్వారా పిల్లలకు బోధిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సి డిపిఓ ఎల్లమ్మ, అంగన్వాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు.