కూడేరు మండల కేంద్రంలోని బళ్ళారి - అనంతపురం జాతీయ రహదారిపై కూడేరు సిఐ శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలి అని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్ సి లు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. ఓవర్ లోడ్ తో ఆటోలలో ప్రయాణీకులను తరలించరాదన్నారు.