కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామం నందు ఇటీవల తాగునీటి సమస్య ఉండటంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో తాగునీటి బోర్లను ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిడిఓ కుల్లాయి స్వామి, ఈ ఓ ఆర్ డి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ నాగదివ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి పరమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పోల మహేష్, వీరుపాక్ష, వీరబద్ర, పాల వెంకటేష్, ధనుజయ ఉన్నారు.