కూడేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడేరు మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రదర్శన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక వైజ్ఞానిక అంశాలపై తయారు చేసిన నమూనా ప్రయోగాలను చేయాలన్నారు.