రేపు పెన్నహోబిలం ఆలయంలో బహిరంగ వేలం

83చూసినవారు
రేపు పెన్నహోబిలం ఆలయంలో బహిరంగ వేలం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహెూబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదాయాన్ని సమకూర్చే వనరులకు రేపు 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి కె. విజయ్ కుమార్ తెలిపారు. ఆలయానికి ఆదాయాన్ని సమకూర్చే తలనీలాలు సేకరణ, టెంకాయలు అమ్ముకునే హక్కు, కొబ్బరి చిప్పల సేకరణకు గురువారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి అంశానికి రూ. లక్ష ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్