మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఎంపీడీఓ

55చూసినవారు
మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఎంపీడీఓ
కలెక్టర్ ఆదేశాల మేరకు ఉరవకొండలోని శివరాంరెడ్డి కాలనీలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో బుధవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ. గౌస్ సాహెబ్, ఎంపీడీఓ సుబ్బరాజు, ఎంఈఓ ఈశ్వరప్ప, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి రోజూ మొక్కలకు నీళ్లు పోయాలని, వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్