ఫుట్బాల్ పోల్స్ తొలగించారు - వేయడం మరిచారు

52చూసినవారు
ఫుట్బాల్ పోల్స్ తొలగించారు - వేయడం మరిచారు
ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉన్న ఫుట్బాల్ పోల్స్ తొలగించి నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారని సోమవారం ఉపాధ్యాయులు విలేఖరులకు తెలిపారు. కొన్నినెలల క్రితం అప్పటి సీఎం జగన్ ఉరవకొండలో నిర్వహించిన ఓ సభకు వచ్చిన సందర్భంగా క్రీడా మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో మైదానంలోని పోల్స్ అన్నింటినీ తొలగించారు. అధికారులు స్పందించి పోల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్