వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఆదివారం సేవాలాల్ మహారాజ్ మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం దేవాలయాన్ని శుభ్రం చేసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సంఘం జాతీయ నేత సేవాగడ్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఎస్. కె కేశవ నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ కాలజ్ఞాన తత్వాన్ని బోధనలను ప్రవచనాలను నేటి యువతరం విశ్వవ్యాపితం చేయాలన్నారు.