వజ్రకరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుకు గ్రామసర్పంచ్ మోనాలిసా చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు పట్టణంలో విద్యార్థుల సౌకర్యార్థం, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా భద్రత కల్పించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవి ప్రసాద్, పాఠశాల ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.