విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామానికి చెందిన నాగవేణి, వీరభద్రయ్య దంపతుల కుమారుడు అశోక్ చక్రవర్తి. తండ్రి వీరభద్రయ్య మృతి చెందాడు. కుమారుడి బాగోగులను తల్లి చూసుకుంటూ వచ్చింది. వ్యసనాలకు బానిసైన అశోక్ చక్రవర్తి తన జల్సాలు తీర్చుకునేందుకు తరచూ డబ్బు కోసం తల్లిని చిత్ర హింసలకు గురి చేసే వాడు. గురువారం సాయంత్రం తల్లిపై అశోక చక్రవర్తి విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.