విడపనకల్లు మండలం పాల్తూరులో వర్షాల కారణంగా వంక సోమవారం ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో బొమ్మనహాల్–ఉరవకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు వంక దగ్గరికి రాకూడదని, దాటేందుకు ప్రయత్నించవద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న వర్షాలు వంక ఉధృతికి కారణమయ్యాయి.