ఉరవకొండ: అనుమానాస్పద స్థితిలో 45 గొర్రెపిల్లలు మృతి

30చూసినవారు
ఉరవకొండ: అనుమానాస్పద స్థితిలో 45 గొర్రెపిల్లలు మృతి
కూడేరు మండలం కడదరకుంటలో పెద్దన్న అనే గొర్రెల కాపరికి చెందిన 45 గొర్రె పిల్లలు అనుమానాస్పదస్థితిలోఅనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల రోజులురోజుల వయసు ఉన్న పిల్లలను దొడ్డీలో వదిలి శనివారం గొర్రెలను మేతకు తరలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో తిరిగి వచ్చి చూడగా 45 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్