ఉరవకొండ మండలం బూదగవి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి వైపు నుంచి గ్యాస్ సిలిండర్ లోడుతో వస్తున్న లారీ ఉరవకొండ నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఐచర్ వాహనంలో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు అతికష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.