రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

10035చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఉరవకొండ పట్టణంలోని దుర్గ భవాని ఆలయం సమీపంలో గుర్రం అడ్డు రావడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న లాల్ కుమార్ (27) అనే యువకుడికి కింద పడి తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లగా గురువారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఆరు నెలల కిందటే వివాహమైంది.

సంబంధిత పోస్ట్