ఉరవకొండ పట్టణంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వాటిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ, ఏఐఎస్ఎ, పిఎస్యు, పిఎస్ఎఫ్ఐ, ఐక్య విద్యార్ధి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు.