ఉరవకొండ: ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ప్రవేశాల కొరకు దరఖాస్తులు

67చూసినవారు
ఉరవకొండ: ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ప్రవేశాల కొరకు దరఖాస్తులు
ఉరవకొండ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఎంఈఓ తిమ్మప్ప విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించిందన్నారు. ఈ నెల 15వ తేది లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్