ఉరవకొండలో జూడో అనంతపురం జోనల్ లెవెల్ స్థాయి పోటీలు స్థానిక జ్యోతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జూడో టోర్నమెంట్ జరిగింది. టోర్నమెంట్ లో ఏవిఆర్ స్కూల్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్, అన్నింట మొదటి స్థానం నిలిచింది. ఈ పోటీల్లో 200 మంది విద్యార్థిని, విద్యార్థులను పాల్గొన్నారు. ఏవిఆర్ పాఠశాల విద్యార్థులు ఏడు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, ఐదు బ్రాంజ్ మెడల్స్ సాధించారు.