ఉరవకొండ: గేటు మీద పడి చిన్నారికి తీవ్ర గాయాలు

ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామంలో శనివారం ఇంటి ముందు వెంకటేష్ అనే నాలుగేళ్ల బాలుడు, మరి కొందరు పిల్లలు గేటు పట్టుకుని అడుకుంటుండగా గేటు మీద పడింది. ఈ ఘటనలో వెంకటేష్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.