వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద గుంతకల్లు ప్రధాన రహదారిలో పెద్ద వంక మీద కల్వర్టు శిథిలం అయ్యిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ భారీ వర్షం పడితే నీరు కల్వర్టుపై నుంచి ప్రవహిస్తాయి. దీంతో అది దెబ్బతిందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్కడ వంతెన నిర్మించాలని కోరారు.