విడపనకల్లు మండలం కేంద్రం నుండి ఆర్ కొట్టాల మీదుగా గడేకల్లు గ్రామం వరకు నూతన తారు రోడ్ నిర్మాణం కొరకు భూమి పూజ చేసి రోడ్ పనులను శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. మంత్రి జెసిబి నడుపుతూ రోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారన్నారు.