ఉరవకొండ: పేద విద్యార్థులకు తల్లికి వందనం ఒక వరం లాంటిది
బెళుగుప్ప మండలం అంకంపల్లిలో నిరుపేద కుటుంబానికి తల్లికి వందనం పథకం ఎంతో ఊరటనిచ్చింది. గ్రామానికి చెందిన గంగమ్మ, ఓబులేష్ దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. అందరికి ఈ పథకం వర్తించిందని గంగమ్మ తెలిపారు. శనివారం ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ. 13వేలు చొప్పున మొత్తం రూ. 78వేలు లబ్ధి కలగడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒకరికే అమ్మఒడి అందిందని చెప్పారు.