విడపనకల్లు మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పొలికి-అంచనహాలు, గడేకల్లు-ఆర్. కొట్టాల, పాల్తూరు- కళవల్లితిప్ప, ఉండబండ-ఉరవ కొండ దారుల్లోని వంకలు పొంగి పొర్లటంతో మధ్యాహ్నం వరకూ రాక పోకలు నిలిచిపోయాయి. విడపనకల్లులోని ఎస్ డబ్ల్యూ పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.