ఉరవకొండ :మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.

60చూసినవారు
ఉరవకొండ :మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఉరవకొండ రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతుల సమావేశం జరిగింది. మండల వ్యవసాయ అధికారి శ్రీవిద్య మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేందుకు రైతులను ప్రోత్సహించారు. కంది పంటలో శెనగపచ్చ పురుగు నివారణకు 1-2 గ్రా ఇమామక్టిన్ బెంజొయెట్ ను 1 లీటర్ నీటిలో కలిపి వాడాలని సూచించారు. అధిక పూత కోసం గ్రోత్ ప్రమోటర్స్, పొటాషియం నైట్రేట్ 1-1.5 గ్రా కలిపి పిచికారి చేయడం వల్ల అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్