ఉరవకొండ: శరవేగంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు చేపట్టాలి

57చూసినవారు
ఉరవకొండ: శరవేగంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు చేపట్టాలి
ఉరవకొండ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే జూలై 10వ తేదికి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేస్తామని చెప్పారని అప్పటిలోపు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా శరవేగంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. శుక్రవారం కౌకుంట్ల దగ్గర 204 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల మధ్య హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు నెమ్మదిగా చేపట్టడంపై హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్