వజ్రకరూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ జనార్దన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు స్వస్తి ఈ నెల 14వ తేది సోమవారం నుండి 19వ తేది షష్టి శనివారం వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి అంగదాల కృష్ణయ్య, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తి ఆదివారం తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 14న సోమవారం కలశస్థాపన, దిగ్రక్షణ ద్వారతోరణ పూజ, ధ్వజ ప్రతిష్ఠ, నేత్రోత్సవం, బేరి పూజ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.