అమరావతిలోని మంత్రి కార్యాలయంలో ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 6 వరకు అమెరికాలోని ఫ్లోరిడా, తంపాలో జరిగే ఎన్ఏటిఎస్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పాల్గొంటామని తెలిపారు.