ఉరవకొండ: భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు

592చూసినవారు
హిందూ, ముస్లీంలు సమైఖ్యంగా జరుపుకొనే మొహరం వేడుకల్లో భాగంగా శనివారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో పెద్ద సరిగెత్తు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆమిద్యాల గ్రామంలో కొడవళ్ళతో తప్పళ్లకు అనుగుణంగా ఎగరడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే యువత ఓకే రకం బట్టలు ధరించి చేతులలో కొడవళ్ళు పట్టుకొని అలాయి ఆడడం జరిగింది. భక్తులు స్వామికి చక్కెర, బెల్లం చదివింపులు చేయించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్