ఉరవకొండ: డ్రోన్ ఆవశ్యకతను రైతులకు అవగాహన కల్పించిన అధికారులు

60చూసినవారు
ఉరవకొండ: డ్రోన్ ఆవశ్యకతను రైతులకు అవగాహన కల్పించిన అధికారులు
ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శుభకర, ఉద్యాన అధికారి నెట్టికంటయ్య ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక రైతు తిమ్మప్ప పప్పు సెనగ పొలాన్ని పరిశీలించి, డ్రోన్ ఆవశ్యకతను రైతులకు వివరించారు. డ్రోన్ టెక్నాలజీని వాడుకుంటే తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలను తక్కువ సమయంలోనే పిచికారి చేయవచ్చని, అదేవిధంగా కూలీల బెడద తగ్గుతుందన్నారు.

సంబంధిత పోస్ట్