మాదిగ ఉద్యోగుల సమాఖ్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని ఏంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో ఆ సంఘం జిల్లా గౌరవ సలహాదారులు సాకే భాస్కర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు రమేష్, మీనుగ భాస్కర్ బాబు, బండారు నాగేంద్ర, ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షులు దుర్గ ప్రసాద్, శ్రీనివాసులు, జెన్నే సుబ్బన్న ఉన్నారు.