విద్యుదాఘాతంతో ప్రైవేటు కార్మికుడుగాయపడిన ఘటన శనివారం సాయంత్రం ఉరవకొండలో చోటుచేసుకుంది. పెద్దముష్టూరుకు చెందిన ప్రభాకర్ ప్రైవేటు విద్యుత్తు కార్మికుడిగా పని చేస్తున్నాడు. విద్యుత్ మరమ్మతు కోసం స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్సకోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తీసుకెళ్లారు.