ఉరవకొండ: రెగ్యులర్ తహశీల్దార్ ను నియమించాలి: సీపీఎం

76చూసినవారు
ఉరవకొండ: రెగ్యులర్ తహశీల్దార్ ను నియమించాలి: సీపీఎం
కూడేరు మండలానికి రెగ్యులర్ తహశీల్దార్ లేక మండలంలోని ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి బీసీ , ఎస్సీ కార్పొరేషన్ల వివిధరుణాల కోసం క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారన్నారు. తక్షణమే ఆర్థిక శాఖ మంత్రి జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్