ప్రారంభానికి సిద్ధమైన రెస్టారెంట్ ధ్వంసం

2983చూసినవారు
ప్రారంభానికి సిద్ధమైన రెస్టారెంట్ ధ్వంసం
ఉరవకొండ పట్టణంలోని అనంతపురం జాతీయ రహదారి సమీపంలో ప్రారంభించడానికి సిద్దంగా ఉన్న రెస్టారెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బూదగవి గ్రామానికి చెందిన నాగభూషణం మిత్రులతో కలిసి రెస్టారెంటు ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు రెస్టారెంట్ లోపల సామగ్రి ధ్వంసం చేశారు. బాధితులు బుధవారం సాయంత్రం గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్