సారా తయారు చేసి, విక్రయిస్తే పీడీ చట్టం ప్రయోగించి, జైలుకు పంపుతామని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమీషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అసిస్టెంట్ కమీషనర్ చంద్రశేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్ తో కలిసి శనివారం ఆయన జిల్లాలో పర్యటించారు. బెళుగుప్పలో నవోదయం 20పై గ్రామ సభ నిర్వహించారు. నాటుసారా నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించారు.