ఉరవకొండ: బైక్ పై ఇద్దరు కంటే ఎక్కువ వెళ్తే కఠిన చర్యలు: ఎస్ఐ

73చూసినవారు
ఉరవకొండ: బైక్ పై ఇద్దరు కంటే ఎక్కువ వెళ్తే కఠిన చర్యలు: ఎస్ఐ
ఉరవకొండ పట్టణంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో గురువారం రాత్రి అర్బన్ ఎస్ఐ జనార్దన్ నాయుడు వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు కంటే ఎక్కువ వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఈమధ్య కాలంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు పెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్