నాటుసారా నిర్మూలనలో అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని అబ్కారీశాఖ ఉప కమీషనర్ నాగమద్దయ్య, అబ్కారీ జిల్లా అధికారి రామన్ రెడ్డి పేర్కొన్నారు. విడపనకల్లులో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2. 0 కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సారా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అబ్కారీ ఉరవకొండ ఇన్స్పెక్టర్ రవిచంద్ర పాల్గొన్నారు.