విడపనకల్లు మండల తహసీల్దార్ ఆర్. వి సునీత బాయికి డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి లభించిందని శనివారం ఆమె విలేకరులకు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ కర్నూలు నేషనల్ హైవేస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా నియమించారు. ఈమె విడపనకల్లు తహసీల్దార్ గా గత ఏడాది ఆగస్టు 5న బాధ్యతలు చేపట్టారు.