విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. కుటుంబంలో వారు పొందిన లబ్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందన్నారు.