ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లు

61చూసినవారు
ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లు
బెళుగుప్ప మండలం జీడిపల్లి, కోణంపల్లి గ్రామాల్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది. ఈ బృందంలో సచిన రాహర, నరేంద్ర ఫాడల్‌, పృథ్వీరాజ్‌ కుమార్‌, పరిహీన జాహిద్‌, మనీషా సందీప్‌, రఘువంశీ, నాగ వెంకటసాహిత ఉన్నారు. రిజర్వాయరు గురించి హంద్రీనీవా అధికారులు వారికి వివరించారు. అనంతరం కోణంపల్లిలో డ్రిప్‌ పద్ధతిలో సాగును హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఫిరోజ్‌ ఖాన్ వివరించారు.

సంబంధిత పోస్ట్