12 రోజులుగా తాగునీరు అందకపోవడంతో ఉరవకొండ పట్టణ వాసులు శనివారం బళ్లారి-అనంతపురం రహదారిపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. 55 వేల పట్టణ జనాభా కలిగిన ఉరవకొండ పట్టణంలో పైపులైన్లు పగిలిపోవడంతో నీటి సరఫరా ఇబ్బందితో పట్టణ ప్రజలు సతమతమవుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది వైఫల్యమా అని ప్రజలు తూర్పారబట్టారు. నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తేవడంలో అధికారులు చొద్యం చూస్తున్నారని ప్రజలు వాపోయారు.