ఉరవకొండ పట్టణంలో రేషన్ బియ్యం అందించే వాహనం తమ వద్దకు రావడం లేదని మూడు నాలుగు రోజుల పాటు తిరిగి పడిగాపులు పడుతున్నామని పట్టణ మహిళలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 10వ వార్డు నాలుగో బ్లాక్ కు చెందిన మహిళలు మాట్లాడుతూ రేషన్ వాహనం తమకాలనీకి రావడం లేదని రేషన్ బియ్యం అందించే స్టోర్ ఎక్కడుందో కూడా తెలియడం లేదని వాపోయారు.