వజ్రకరూరు మండల కేంద్రంలోని గూళ్య పాలెం గ్రామం అంగన్వాడి కార్యాలయంలో బుధవారం బాల్యవివాహాల నిరోధక, ఫోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హెల్త్ సూపర్వైజర్ నాగ శంకర్, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. బాల్యం వివాహం జరిగితే మీరు కుటుంబ సభ్యులకు శిక్ష పడే అవకాశం రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.