అధునాతన సౌకర్యాల కోసం ధర్తీ జన జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా అభివృద్ధి చేయుటకు వజ్రకరూరు మండలం రూపానాయకతండా, వెంకటంపల్లి తండాలు గ్రామపంచాయతీని ఎంపిక చేయడం హర్షనీయమని నోడల్ ఆఫీసర్ ఏపీ డి విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్డిటి కమ్యూనిటీ భవనంలో ఏర్పాటైన గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటాన్ని పూలమాలవేసి పూజలు నిర్వహించారు.