ఉరవకొండ లో ఆంద్రప్రదేశ్ మహాసభ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవం జరిగినందున దండి శివానంద ను గురువారం ఘనంగా సన్మానించారు. విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలోని స్థానిక హైస్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శివానంద ని, రాష్ట్ర కమిటీ ఏర్పటుకు కృషి చేసిన వారిలో ఒకరైన టి. మల్లికార్జున ని ఉరవకొండ నియోజకవర్గ వీరశైవ సభ్యులు, వీరశైవ మహాసభ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఘనంగా సన్మానించారు.