విడపనకల్లు: సబ్సిడీతో పశువుల దాణా రైతులకు పంపిణి

68చూసినవారు
విడపనకల్లు: సబ్సిడీతో పశువుల దాణా రైతులకు పంపిణి
విడపనకల్లు మండలం కేంద్రంలో ఉన్న పశు వైద్యశాల వద్ద పశువులు ఉన్న రైతులకు 50% సబ్సిడీ పై పశువుల దాణా, 70% సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాలు మండల పశు వైద్యాధికారులు శనివారం  పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, హనుమంతు, రామాంజి, వెంకటేశ్, మండల పశు వైద్యాధికారి నరేశ్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమ మే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, గ్రామల్లో ఉన్న ప్రతి ఒక రైతు కుటుంబం పశువుల ను పెంచుకోవాలి అని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్