బెళుగుప్ప మండలం జీడిపల్లి వద్ద ఉన్న హంద్రీనీవా పంప్ హౌస్ ను ఆదివారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలేనేని సురేంద్రబాబు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టుకు నీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీడిపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు.