ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసేసింది. ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమి నాయకులు ఏసీఏ ప్రక్షాళన బాధ్యతలు చూస్తున్న ఎంపీ కేశినేని చిన్నితో మంత్రాంగం సాగిస్తున్నారు. ధోనీ, కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలున్న జేసీ పవన్ రెడ్డి వంటి వారికి బాధ్యతలపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది.