ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బులు

57చూసినవారు
ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బులు
AP: కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను జూన్ 20న విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 45.71 లక్షల రైతు కుటుంబాలతో జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు లేదు తగ్గవచ్చని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు కేంద్ర సాయం, రాష్ట్ర సాయం కలిపి రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్